రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ !
Published on Mar 5, 2018 8:13 am IST

భూస్వాములను దోచి, పేదలకు పంచిన తెలుగు వారి రాబిన్ హుడ్, స్టువర్టుపురం టైగర్ నాగేశ్వర్ రావ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని సినిమా తెరకేక్కబోతోంది. రానా ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలకు దర్శకత్వం వహించిన వంశి కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నారు.

ఏప్రిల్ చివరి వారంలో ముహూర్తం జరుపుకొని మే నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను ఏకే.ఎంటర్టైన్మెంట్ సంస్థలో అనిల్ సుంకర నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రానా ఈ సినిమా కోసం డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. నేనేరాజు నేనేమంత్రి సినిమా తరువాత రానా చేస్తోన్న తెలుగు సినిమా ఇదే అవ్వడం విశేషం.

 
Like us on Facebook