కంటి ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న రానా..!

కంటి ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న రానా..!

Published on Jun 3, 2018 3:31 AM IST

రానాకి కొంతకాలంగా కుడి కన్ను చాలా నొప్పితో ఇబ్బంది పెడుతోందట. త్వరలో ఆయన USలో తన కంటి ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో ఓ షోలో తన కన్ను ఒకటి సరిగా కనిపించదు అని కూడా చెప్పారు. రానా కొన్నివారాలు తన షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి.. ప్రిలిమినరీ చేకప్స్ కోసం US వెళ్లారు.

అయితే రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సర్జరీ ఇండియాలో జరగదని ప్లేస్ ఫిక్స్ చేయాల్సి ఉందని చెప్పారు. సరైన సమయం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రానా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. హాథీ మేరే సాథీ సినిమాలోనూ.. ప్రభు సాల్మన్‌తో ఓ సినిమాలో రానా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లోనూ నటించే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి.

తాజా వార్తలు