మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో “విరాట పర్వం” కూడా ఒకటి. నిజానికి ఎప్పటి నుంచో తెరకెక్కుతున్న ఈ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ డ్రామా ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయ్యింది. కానీ థియేట్రికల్ గా ప్లాన్ చేసేసరికి మళ్ళీ కరోనా రెండో వేవ్ రావడంతో వాయిదా పడింది.
మరి ఈ ప్యాండమిక్ టైం లోనే ఓటిటి సంస్థలు అనేక సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసి ఊపందుకున్నాయి. అలా ఇప్పుడు రెండో వేవ్ టైం లో కూడా కొన్ని చిత్రాలు నేరుగా ఓటిటి బాటే పట్టాయి. ఇప్పుడు అదే రిలీజ్ లో రానా “విరాట పర్వం” కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
అయితే మరో టాక్ ప్రకారం ప్రస్తుతం వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 లు ఫిక్స్ అయ్యాయి కానీ విరాట పర్వం పై రూమర్స్ మాత్రమే అని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.


