ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి సన్నద్ధం అవుతున్న రానా !

రానా దగ్గుబాటి ప్రస్తుతం ద్విభాషా చిత్రం గా తెరకెక్కుతున్న’అరణ్య’ చిత్ర షూటింగ్ లో బిజీ గా వున్నారు ఇది గాక ఆయన ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో నటించనున్నారని తెల్సిందే అయితే సినిమా లో ఈ పాత్రా చాలా ముఖ్యమైనది కావడం తో రానా ఇప్పటినుండే ఆ పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్స్ ను స్టార్ట్ చేశాడు దీనిలో భాగంగా అయన చిత్ర డైరెక్టర్ క్రిష్ ను కలిసి పాత్ర ఎలావుండనుందో చర్చించనున్నారు

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జులై మొదటి వారం లో ప్రారంభం కానుంది . ఇక రానా సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెర షో నెంబర్ 1 యారి సెకండ్ సీజన్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయనహోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ మంచి రేటింగ్స్ ను సాధించింది .