డిఫరెంట్ ఫ్రాంచైజ్ లీగ్ లు రావడంతో ఇండియాలో క్రీడా రంగం సరికొత్త కళను సంతరించుకుంటుంది. తాజాగా టెన్నిస్ లీగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మన హైదరాబాద్ టెన్నిస్ టీంను హైదరాబాద్ ఏసెస్ గా నామకరణం చేశారు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ హీరో రానా దగ్గుబాటి ఈ టీంను ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. రానాతో పాటు కాజల్ అగర్వాల్ కూడా కూడా హైదరాబాద్ ఏసెస్ టీంను ప్రమోట్ చేయనుంది.
ఈ ఇద్దరు తారలు హైదరాబాద్ ఏసెస్ టీం ఆడే మ్యాచ్ ల వద్ద సందడి చేయడంతో పాటు ఫ్రాంచైజ్ ను ప్రమోట్ చేస్తారు. రానా మరియు కాజల్ ఇద్దరూ తమ కీరీర్ లో ఉన్నత స్థానాలలో ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.


