‘విరాటపర్వం’ ముగిశాకే ‘హిరణ్యకశ్యప’

Published on Jan 18, 2020 12:00 am IST

లాంగ్ గ్యాప్ తర్వాత రానా దగ్గుబాటి తిరిగి సినిమా పనుల్లోకి దిగారు. ప్రస్తుతం ఆయన వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ ప్రజెంట్ కేరళ అడవుల్లో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక రానా సైన్ చేసిన మరొక చిత్రం ‘హిరణ్యక్కశ్యప’. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

వేసవి నాటికి ‘విరాటపర్వం’ చిత్రీకరణ పూర్తిచేసి ఆ వెంటనే ‘హిరణ్యకశ్యప’ చిత్ర షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తికావడానికి సుమారు 8 నెలలు పండుతుందని టీమ్ అంచనా వేస్తున్నారట.
ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More