‘రణరంగం’ మొదటిరోజు ఎంత వసూలు చేసిందంటే…!

Published on Aug 16, 2019 11:46 am IST

శర్వానంద్ హీరోగా, కాజల్ అగర్వాల్,కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్లుగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన రణరంగం మూవీ నిన్న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదలైంది.ఈ చిత్రానికి ఫిలిం క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందనరాగా, ఆడియెన్స్ మాత్రం పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని తెలుస్తుంది. వర్డ్ అఫ్ మౌత్ బాగుండటంతో రణరంగం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3.8 కోట్ల షేర్ సాధించిందని సమాచారం. వరల్డ్ వైడ్ గా 4.25 కోట్ల షేర్ రణరంగం మూవీ వసూలు చేసింది.

గురువారమే విడుదలైన ఈ మూవీకి లాంగ్ వీకెండ్ లభించింది. దీనితో ఇంకా మూడురోజులు వారాంతపు దినాలు ఉండటంతో మంచి వసూళ్లు దక్కించుకొనే అవకాశం కలదు. దీనికి తోడు వచ్చే వారం పెద్ద సినిమాల విడుదల కూడా లేకపోవడం రణరంగం చిత్రానికి కలిసొచ్చే అంశం. ఐతే అడివి శేషు నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు చిత్రంతో రణరంగం పోటీపడాల్సివుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన రణరంగం చిత్రానికి సి,బి సెంటర్స్ లో ఎక్కువ ఆదరణ దక్కే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :