ఆ సినిమాలో రానా క్యారెక్టరే హైలెట్ అంటా !

ఆ సినిమాలో రానా క్యారెక్టరే హైలెట్ అంటా !

Published on Apr 3, 2019 1:00 AM IST

దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో రానా సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్ లుగా ‘విరాటపర్వం’ అనే రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ల‌వ్ స్టోరీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు వేణు. ఇక జులై నుంచి సెట్స్‌ పైకి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు నటించనున్నట్లు తెలుస్తోంది.

రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ట‌బు మాన‌వ హ‌క్కుల నేత‌గా నటిస్తోందట. ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ విడుద‌ల చేయాల‌నుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమాలోనూ రానా క్యారెక్టరే హైలెట్ గా నిలుస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు