రానా రూ.180 కోట్ల సినిమాకు లైన్ క్లియర్ అవుతోంది

Published on Feb 19, 2020 2:06 am IST

భిన్నమైన కథలతో ప్రయోగాలు చేసే నటుడు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టుల్లో ‘హిరణ్యకశ్యప’ కూడా ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వర్చ్యువల్ టెక్నాలజీని వాడటమే కారణం. పర్ఫెక్షన్, క్వాలిటీ కోసం టీమ్ ఈ సాంకేతికతను వాడుతున్నారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు కూడ.

ఇప్పుడు ఆ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. రానా చేస్తున్న ‘అరణ్య’ విడుదలకు రెడీ అవడం, వేణు ఊడుగుల దర్శకత్వంలో చేస్తున్న ‘విరాటపర్వం’ చకచకా జరుగుతుండటంతో త్వరలోనే అంటే వేసవి లేదా వేసవి తర్వాత గుణశేఖర్ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే వీలుంది. పురాణగాథల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు రూ.180 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More