ప్రతీ సినిమాలో తనను తాను సరికొత్తగా సృష్టించుకుంటూ రానా అందరిని గత మూడు సంవత్సరాలుగా మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం రానా రుద్రమదేవి, బాహుబలి సినిమాలతో నిరంతరం బిజీగా ఉంటున్నాడు.
ప్రస్తుతం తమిళం లో రీమేక్ అవుతున్న బెంగుళూరు డేస్ సినిమాలో కొత్త లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. నున్నటి గెడ్డంతో షార్ట్ హెయిర్ తో బరువు తగ్గి గ్రీక్ దేవుడిలా వున్నాడు. తాను తీసుకున్న వెజ్ డైట్ కూడా దీనికి కారణమని తెలుస్తుంది.
ఈ సినిమాలో శ్రీ దివ్యకి భర్త పాత్రలో అలరించనున్నాడు. మరో ముఖ్య పాత్రను ఆర్య పోషించాడు. పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. తెలుగు వెర్షన్ లో పాత్రధారుల వివరాలు ఇంకా ఖరారు కాలేదు.


