విరాటపర్వం మొదలయ్యేది అప్పుడే

Published on Jun 5, 2019 3:10 pm IST

భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు రానా దగ్గునాటి. ఈయన సైన్ చేసిన తెలుగు సినిమాల్లో ‘విరాటపర్వం’ కూడా ఒకటి. ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ జూలై నుండి మొదలుకానుంది. 1920 నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటించనుంది. ఈ క్రేజీ కాంబినేషన్ వలన ప్రేక్షకుల్లో సినిమాపై మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి ఈ చిత్రం రూపొందనుంది. ఇకపోతే ఇందులో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More