అనుకున్నట్టే ‘విరాటపర్వం’ వెనక్కి

Published on Apr 14, 2021 5:45 pm IST

కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ పరిశ్రమలో అలజడి సృష్టిస్తోంది. పెరుగుతున్న కేసుల కారణంగా త్వరలో థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను విధించారు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో పూర్తయ్యే దశలో ఉండి విడుదల తేదీలను ఫైనల్ చేసుకున్న సినిమాలు కూడ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య, లవ్ స్టోరీ, టక్ జగదీష్’ చిత్రాలు వాయిదాపడగా తాజాగా మరొక సినిమా కూడ వెనకడుగు వేసింది. అదే ‘విరాటపర్వం’.

రానా దగ్గుబాటి చేస్తున్న కొత్త సినిమాల్లో ‘విరాటపర్వం’ కూడ ఒకటి. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం సినిమా 30 ఏప్రిల్ నాడు విడుదలకావాలి. కానీ కరోనా ఉధృతి ఎక్కువ అవుతుండటంతో వాయిదా వేశారు టీమ్. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సంబంధిత సమాచారం :