ఏప్రిల్ పోటీలో రానా కూడ దిగిపోయాడు

Published on Jan 28, 2021 5:30 pm IST

రానా దగ్గుబాటి చేస్తున్న కొత్త సినిమాల్లో ‘విరాటపర్వం’ కూడ ఒకటి. వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. లాక్ డౌన్ అనంతరం మొదలైన ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఫస్ట్ లుక్, టీజర్లతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితమే నిర్మాతలు ప్రకటించారు.

90వ దశకంలో తెలంగాణలోని నక్సల్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు సమర్పిస్తున్నారు. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇప్పటికే ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, నాని ‘టక్ జగదీష్’, నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, గోపీచంద్ ‘సీటిమార్’ బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి రానా సినిమా కూడ చేరడంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

సంబంధిత సమాచారం :