ఒక్క సినిమాతో యువ హీరో రేంజ్ మారిపోయింది !

Published on Jul 25, 2018 6:30 pm IST

బాలీవుడ్ యువ హీరో రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సంజు’ ఇటీవల విదులైన ఈ చిత్రం సుమారు 500కోట్లకు పైగా వసూళ్లను సాధించి కొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమాలో నటించిన రన్బీర్ ఫై ప్రశంసల వర్షం కురిస్తుంది. ప్రముఖ నటుడు సంజయ్ దత్ బయోపిక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో రన్బీర్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా తెచ్చిన పేరుతో ఆయన రెంజ్ ఒక్క సారిగా మారిపోయింది. ప్రస్తుతం 10 బ్రాండ్ లకు ప్రచారకర్త గా వ్యవహరిస్తున్నరన్బీర్ ఈచిత్రం విడుదలకు ముందు రోజుకు 3 కోట్ల నుండి 3. 5 కోట్ల వరకు ఛార్జ్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా 6కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇక ప్రస్తుతం రన్బీర్ ‘బ్రహ్మస్త్ర’ అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడాఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :