బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం అత్యంత భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే మొదటి భాగం చిత్రీకరణ పూర్తి కాగా, ప్రస్తుతం రెండో భాగం షూటింగ్ జరుగుతోంది. తాజాగా రణ్‌బీర్ కపూర్ అయోధ్యలో రూ.3.31 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడంపై రణ్‌బీర్ స్పందిస్తూ.. ‘అయోధ్యే నన్ను ఎంచుకుందని నేను నమ్ముతున్నాను.. ఆ పిలుపుకే నేను సమాధానం ఇచ్చాను’ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ తన ఆహారపు అలవాట్లను మరియు లివింగ్ స్టైల్ కూడా మార్చుకోవడం గమనార్హం.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ పౌరాణిక గాథ మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.
