రణబీర్ కపూర్ లేటెస్ట్ మూవీ కి ఫస్ట్ డే డీసెంట్ వసూళ్లు!

Published on Mar 9, 2023 6:17 pm IST


బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యొక్క కొత్త చిత్రం తు ఝూటి మైన్ మక్కర్ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు కూడా పెద్దగా ప్రచారం జరగలేదు. అయితే ఈ సినిమా తొలిరోజు డీసెంట్ వసూళ్లను రాబట్టి, ఇండియాలో 15.73 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అలాగే, హోలీ హాలిడే అడ్వాంటేజ్ మరియు రణబీర్ యొక్క స్టార్ పవర్ సినిమా మొదటి రోజు మంచి నంబర్‌ను పోస్ట్ చేయడంలో సహాయపడింది. మున్ముందు రిలీజ్‌లు లేవు కాబట్టి రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి బిజినెస్‌ని సాధించాలి. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్‌తో కలిసి లవ్ రంజన్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :