బాలీవుడ్ సినిమా నుంచి వస్తున్న అవైటెడ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “రామాయణ” కోసం అందరికీ తెలిసిందే. పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రామునిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఫుటేజ్ వైరల్ గా మారింది.
రణబీర్ పై ఓ యుద్ధ సన్నివేశం సీన్ వైరల్ అవుతుండగా అది చూసి అంతా షాకవుతున్నారు. అయితే అసలు దీనిపై నిజం ఏంటి అనేది తెలుస్తుంది. ఆ వైరల్ అవుతున్న ఫుటేజ్ లో ఎలాంటి నిజం లేదట. అది పూర్తిగా ఏ ఐ తో చేసింది అని ఒరిజినల్ సీన్ కూడా ఒకటి బయటకి వచ్చింది. సో అది ఫేక్ అని తేలిపోయింది. ఇక అంతా ఇప్పుడు సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తుండగా దీనిని జూలై లో విడుదల చేయనున్నట్టు టాక్. ఇక ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.


