తెలుగు రాష్ట్రాల్లో “రంగ్ దే” డే 1 షేర్ లెక్కలు ఇవే!

Published on Mar 27, 2021 11:00 am IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన చిత్రం “భీష్మ”తో సాలిడ్ కం బ్యాక్ అందుకున్నాడంటే మళ్ళీ ‘చెక్’ తో చతికల పడ్డాడు. మళ్ళీ ఈ ఏడాది హిట్ కొట్టాలనే వెంటనే మోస్ట్ అవైటెడ్ “రంగ్ దే” తో ముందుకొచ్చాడు. తాను హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ నిన్ననే విడుదల కాబడింది. మరి ఇలా వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లను రాబట్టినట్టుగా పి ఆర్ టీం చెబుతున్నారు. మరి ఈ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మొదటి రోజు షేర్ వివరాలు చూసుకున్నట్టయితే..

నైజాం: రూ .1.54 కోట్లు
తూర్పు: రూ. 0.52 కోట్లు
పశ్చిమ: రూ. 0.31 కోట్లు
కృష్ణ: రూ. 0.21 కోట్లు
నెల్లూరు: రూ. 0.24 కోట్లు
వైజాగ్: రూ. 0.56 కోట్లు
గుంటూరు: రూ. 0.67 కోట్లు (హైర్స్ తో కలిపి)
సీడెడ్: రూ. 0.60 కోట్లు

ఏపీ, తెలంగాణాలో మొత్తం ఫస్ట్ డే షేర్ – 4.65 కోట్లు ఈ చిత్రం రాబట్టింది. కాస్త మంచి టార్గెట్ తోనే విడుదల కాబడిన ఈ చిత్రం వీకెండ్ లో కూడా మంచి వసూళ్లను అందుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :