బుల్లితెర మీద కూడా రికార్డు సృష్టించిన ‘రంగస్థలం’ !

Published on Oct 25, 2018 12:17 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రూరల్ డ్రామా ‘రంగస్థలం’ ఇటీవల విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 120కోట్ల షేర్ ను రాబట్టి ‘బాహుబలి’ చిత్రం తరువాత తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

ఇక తాజాగా ప్రముఖ టీవీ ఛానల్ మా టీవీలో ఈచిత్రాన్ని ప్రసారం చేశారు. రికార్డు స్థాయిలో ఈచిత్రం 19.5 టిఆర్పి రేటింగ్స్ ను రాబట్టి ఛానెల్ ను అగ్ర స్థానంలో నిలబెట్టింది. సమంత కథానాయికగా నటించిన ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :