మరో రికార్డ్ బద్దలు కొట్టిన రంగస్థలం

15th, April 2018 - 01:25:40 PM

రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో డిఫెరెంట్ గా తెరకెక్కిన రంగస్థలం సినిమా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది. ఇప్పటికే సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఎక్కడా కూడా సినిమాకు పెద్దగా నెగిటివ్ కామెంట్స్ అందలేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్స్ అందడంతో కలెక్షన్స్ పెరిగిపోతన్నాయి. వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా రంగస్థలం నిలిచింది.

మొత్తంగా సినిమా ఇప్పటివరకు రూ.175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. కృష్ణార్జున యుద్ధం పోటీగా వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించట్లేదు. సుకుమార్ ఫ్యాన్స్ మారోసారి సినిమా చూసేందుకు సిద్దపడుతున్నారు. ఏ బి సెంటర్లతో పాటు మాస్ ఆడియెన్స్ ని కూడా సినిమా ఆకట్టుకుంటోంది. ఇక ఈ వారం భరత్ అనే నేను సినిమా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా ప్రభావం రంగస్థలంపై ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.