‘ఉప్పెన’లో ‘రంగస్థలం’ ఛాయలు ఉంటాయా ?

Published on Dec 15, 2020 2:00 am IST

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తగా కుర్రాడు వైష్ణవ్ తేజ్. ఆయన చేసిన మొదటి సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ వద్ద డైరెక్షన్ డిపార్టుమెంట్లో వర్క్ చేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను సుకుమార్ దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగియగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ పూర్తయ్యాయి. కానీ థియేటర్లు ఇంకా పూర్తిస్థాయి తెరుచుకోకపోవడంతో రిలీజ్ ఆలస్యమవుతోంది. ఒక్కసారి థియేటర్లు ఓపెన్ అయితే మొదట విడుదలకాబోయే సినిమాల జాబితాలో ఇది కూడ ఉంటుంది.

ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక ప్రముఖ పాత్ర చేయడం జరిగింది. అదే ప్రతినాయకుడి పాత్ర. అయితే ఇందులో విలన్ ఉంటాడంటే ఉన్నట్టు కాకుండా ఆయన పాత్రకు చాలా డెప్త్ ఉంటుందట. హీరోకు, విజయ్ సేతుపతి నడుమ నడిచే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయట. ఒకరకంగా చెప్పాలంటే చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ప్రతినాయకుడు ప్రెసిడెంట్ పాత్రలో ఉన్న తరహా ఛాయలు విజయ్ సేతుపతి పాత్రలో ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్. ఆయన పాత్ర, నటన సినిమాకే హైలెట్ అవుతాయని అంటున్నారు. మరి అందరూ అంటున్నట్టు సేతుపతి ఏ స్థాయిలో మెప్పించారో చూడాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించడం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :