6వ స్థానంలో నిలిచిన ‘రంగస్థలం’ !

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’ భారీ అంచనాల నడుమ ఈ రోజే విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ సాదిస్తున్న ఈ చిత్రం ఓవర్సీస్లో కూడ మంచి వసూళ్లనే రాబడుతోంది. ప్రదర్శితమైన ప్రీమియర్ల ద్వారా 6.92 లక్షల డాలర్లను రాబట్టుకుందీ సినిమా.

ఇంకా కొన్ని లొకేషన్స్ నుండి వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది. ‘బాహుబలి-2, అజ్ఞాతవాసి, ఖైదీ నెం 150, బాహుబలి-1, స్పైడర్’ వంటి చిత్రాల తర్వాత ప్రీమియర్ల ద్వారా అత్యధిక వసూళ్లను సాధించిన 6వ చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది. లాంగ్ రన్లో మంచి వసూళ్లను రాబట్టడానికి ఇది మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు.

Exit mobile version