‘రంగస్థలం’ 3వ పాట ఎప్పుడంటే !
Published on Mar 7, 2018 5:06 pm IST

రామ్ చరణ్ తాజ్ చిత్రం ‘రంగస్థలం’ పాటలు ఒక్కొక్కటిగా విడుదలవుతూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు బయటికొచ్చిన రెండు పాటలు ‘ఎంత సక్కగున్నావే, రంగ రంగ రంగస్థలాన’ బాగా ఆకట్టుకోగా ఇప్పుడు మూడవ పాట ‘రంగమ్మ మంగమ్మ’ మార్చి 8న సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.

ఇక చిత్ర దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా సమంత నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదలచేయనున్నారు. ‘ధృవ’ తరవాత చరణ్ చాలా సమయం తీసుకుని చేసిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పైగా ఇందులో చరణ్ వినికిడి లోపం ఉన్న భిన్నమైన పాత్రలో కనిపించనుండటం మరో ఆకర్షణీయ అంశంగా మారింది.

 
Like us on Facebook