వరుసగా మూడో సారి 100కోట్ల క్లబ్ లో చేరనున్న హీరో !

Published on Feb 19, 2019 5:28 pm IST

బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం ‘గల్లీబాయ్’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నిన్న ఈ చిత్రం ఇండియాలో 8. 65 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక 5 రోజులకుగాను దేశవ్యాప్తంగా ఈ చిత్రం 81.10 కోట్ల వసూళ్లను రాబట్టింది. రేపటి తో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఈ చిత్రం అటు ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది. ఇప్పటివరకు అక్కడ 34.31 కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇక ఈ చిత్రం తో రణ్వీర్ వరుసగా మూడో సారి 100 కోట్ల క్లబ్ లో చేరనున్నాడు. గత ఏడాది పద్మావత్ , సింబా చిత్రాలతో రణ్వీర్ ఈ ఫీట్ సాదించాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని తెలుగులో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీమేక్ చేస్తునట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం ఫై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

సంబంధిత సమాచారం :