మరోసారి 100కోట్ల క్లబ్ లో చేరిన హీరో !

Published on Jan 3, 2019 8:24 am IST

బాలీవుడ్ లో గత ఏడాది చివరి సినిమా గా విడుదలై బాక్సాఫిస్ ను షేక్ చేస్తుంది ‘సింబా’ చిత్రం. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. దేశ వ్యాప్తంగా ఈచిత్రం కేవలం 5రోజుల్లోనే 124 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. సూపర్ హిట్ తెలుగు మూవీ ‘టెంపర్’ కు రీమేక్ గా రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈచిత్రం హిందీ ప్రేక్షకులను అలరిస్తుంది. సారా అలీ ఖాన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ ,రోహిత్ శెట్టి సంయుక్తంగా నిర్మించారు.

ఇక రణ్వీర్ ఈ చిత్రంతో బ్యాక్ టు బ్యాక్ 100కోట్ల వసూళ్లను రాబట్టిన హీరో గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఆయన నటించిన ‘పద్మావత్’ గత ఏడాది విడుదలై ఈ ఫీట్ ను సాధించింది.

సంబంధిత సమాచారం :

X
More