టాలీవుడ్ లో తన మొదటి సినిమా తోనే ఒక క్లీన్ అండ్ నెక్స్ట్ లెవెల్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు వెంకటేష్ మహా. కేరాఫ్ కంచారపాలెం సినిమాతో ఒక మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చి లేటెస్ట్ గా రావు బహదూర్ సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేయడానికి రాబోతున్నారు. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన ఈ ప్రయోగాత్మక సినిమా విషయంలో మేకర్స్ కాన్ఫిడెన్స్ మాత్రం మాములు లెవెల్లో లేదు.
ఇది ఖచ్చితంగా నిజం అని ఇప్పటికీ చెబుతున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో 51 శుక్రవారాలు వేరు ఈ జూలై 3న రానున్న శుక్రవారం మాత్రం వేరేగా ఉంటుంది అని చాలా బలంగా తమ సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ చూడనిది టాలీవుడ్ నుంచి చూస్తారని చాలా నమ్మకంగా ఉన్నాం, మేమేం సాధించామో దాని పట్ల చాలా నమ్మకంగా ఉన్నామని చెబుతున్నారు. దీనితో రావు బహదూర్ పట్ల అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. సో ఈసారి వెంకటేష్ మహా మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి.
It is…!
We will stand on the phrases we kept on saying…!
“JULY 3rd Friday is DIFFERENT from all the 51 other Fridays of the year”
“Experience Telugu cinema like never before”
Very very confident.
Very proud on what we’ve achieved.
On July 3rd. We will take you on a… https://t.co/bKLlpidQk8— Rao Bahadur (@RaoBahadurMovie) June 21, 2026


