ట్రైలర్ టాక్ : మహేష్ వాయిస్ ఓవర్‌తో ‘రావు బహదూర్’ ప్రపంచం..!

ట్రైలర్ టాక్ : మహేష్ వాయిస్ ఓవర్‌తో ‘రావు బహదూర్’ ప్రపంచం..!

Published on Jun 30, 2026 8:51 PM IST

సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమాకు, సూపర్ స్టార్ మహేష్ బాబు తోడవడంతో మరింత క్రేజ్ మరియు హైప్ పెరిగింది.

తాజాగా ఈ చిత్ర మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ అందించాడు. ‘అనుమానం అనేది చాలా ప్రమాదకరమైనది, అది చనిపోతున్న మనిషిని కూడా బతికిస్తుంది. అదే అనుమానం మనిషి మైండ్‌తో ఆడుకుంటూ ఒక వింత లోకంలోకి తీసుకెళ్తుంది’ అంటూ మహేష్ బాబు సినిమా ప్రధాన కథాంశాన్ని తనదైన శైలిలో వివరించాడు. ఈ ట్రైలర్ కేవలం కథను పరిచయం చేయడమే కాకుండా ఒక సరికొత్త ప్రకటనలా సాగింది. తెలుగు సినిమాల్లో ‘రావు బహదూర్’ మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని ఇస్తుందని మహేష్ బాబు చివర్లో పేర్కొన్నాడు.

ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, A+S మూవీస్, మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు