ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రావు రమేష్‌ రెమ్యునరేషన్..!

Published on Aug 17, 2021 3:00 am IST

ప్రముఖ నటుడు రావు రమేశ్ రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌గా మారింది. ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో మెప్పించగలిగే రావు రమేశ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం రావు రమేశ్ మలయాళంలో సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకున్న ‘నాయట్టు’ రీమేక్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమా కోసం రావు రమేశ్ కోటిన్నర పారితోషికం తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటమే కారణంగానే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ స్టార్లకు సమానంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటుండడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చానీయాశంగా మారింది.

సంబంధిత సమాచారం :