మాసివ్ ఎనర్జిటిక్ కాంబో రెడీ.. ‘బోయపాటి – రామ్’ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ !

Published on Oct 3, 2022 2:39 pm IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి చిత్రబృందం ఒక క్రేజీ అప్ డేట్ ను రివీల్ చేసింది. ఈ సందర్భంగా ఒక ట్వీట్ ను పోస్ట్ చేశారు. ‘ఎదురుచూపులు ముగిశాయి. ఇక మాసివ్ ఎనర్జిటిక్ కాంబోతో దసరా వేడుకలు ప్రారంభిద్దాం. అక్టోబర్ 5న అప్‌ డేట్‌లు రాబోతున్నాయి. వేచి ఉండండి’ అని ఒక మెసేజ్ ను పోస్ట్ చేశారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట.

ఆల్ రెడీ అఖండ సినిమాతో బోయపాటి తన ఖాతాలో భారీ హిట్ ను వేసుకున్నాడు. కాబట్టి .. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. రామ్ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :