ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రం షూటింగ్ షురూ..!

Published on Jul 12, 2021 10:06 pm IST

రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నేడు షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రం ఏక కాలంలో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. అయితే శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అయితే నేడు హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడం తో చిత్రం యూనిట్ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. అయితే ఉస్తాద్ రామ్ ఈ చిత్రం లో సూపర్ కూల్ లుక్ లో కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :