వెంకీ మామ బేబీ మీతో చాట్ చేస్తుందట.

Published on Dec 11, 2019 11:24 am IST

ఇంకా కేవలం రెండు రోజులలో వెంకీ మామ మూవీ థియేటర్లలో దిగనుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. ఇక వెంకీ మామ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా చేస్తున్న రాశి ఖన్నా నేడు సాయంత్రం 5గంటల నుండి ట్విట్టర్లో అభిమానులతో చాట్ చేస్తారట. ఆస్క్ రాశి అనే యాష్ ట్యాగ్ తో ఆమెను వెంకీ మామ చిత్ర విశేషాలు అడిగి తెలుసుకోవచ్చు. చిత్ర ప్రచారంలో భాగంగా రాశి ఖన్నా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించనున్నారు. రాశి ఖన్నా పెల్లెటూరికి చెందిన మోడరన్ అమ్మాయిగా కనిపించనున్నారు.

ఇక నాగ చైతన్య, వెంకటేష్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. దర్శకుడు బాబీ మామ అల్లుళ్ళ మధ్య నడిచే ఫన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో వెంకీ మామ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More