‘గీత గోవిందం’ హీరోయిన్ కి ఆఫర్స్ పెరుగుతున్నాయి !
Published on Aug 21, 2018 5:44 pm IST


రష్మిక మందన్న ‘ఛలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ, ‘గీత గోవిందం’ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా దగ్గరైంది. గీత పాత్రలో ఆమె నటన అన్ని వర్గాల ఆడియన్స్ ను అక్కట్టుకున్నేలా ఉంది. ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన గ్లామర్ తోనూ గీత గోవిందం చిత్రం విజయంలో ముఖ్య భూమిక పోషించింది. హీరోని టార్చర్ పెట్టే సన్నివేశాల్లో కళ్లల్లో రష్మిక పలికించిన హావభావాలకి యూత్ ఫిదా అయిపోయారు.

కాగా ఈ ఒక్క సినిమాతో రష్మికకు అమాంతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆమెను తమ సినిమాలో నటింపజేయాలని కొత్త దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి క్రేజీ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తే ఇక రష్మిక మందన్న తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook