దేవదాస్ కోసం బ్యాంకాక్ లో రష్మిక !

దేవదాస్ కోసం బ్యాంకాక్ లో రష్మిక !

Published on Aug 19, 2018 11:39 PM IST

ఇక గీత గోవిందం తో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న హీరోయిన్ రష్మిక ‘దేవదాస్’ చిత్రం కోసం బ్యాంకాక్ కు వెళ్ళింది. కింగ్ నాగార్జున మరియు నాని లు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతుంది. కొద్దీ రోజుల నుండి ఈ షెడ్యూల్ లో నాని పాల్గొంటుండగా ఇప్పుడు రష్మిక కూడా జాయిన్ అయ్యింది. భలేమంచి రోజు’ ఫెమ్ శ్రీ రామ్ ఆధిత్య తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా, నాని కి జోడిగా రష్మిక నటిస్తున్నారు.

వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రౌడీ పాత్రలో దేవ్ గా నాగ్ నటిస్తుండగా డాక్టర్ పాత్రలో దాస్ గా నాని కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు