నాకు పూర్తి సపోర్ట్ అందిస్తున్నారు – క్రేజీ బ్యూటీ

Published on Aug 11, 2019 8:01 pm IST

‘ఛలో’ సినిమాతో టాలీవూడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి.. రెండవ చిత్రం ‘గీతగోవిందం’తో ఏకంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ. ఆ తరువాత మూడవ చిత్రంగా నాని – నాగార్జున మల్టీస్టారర్ దేవదాస్ లో నటించింది. అలాగే హీరోయిన్ గా ప్రస్తుతం స్టార్ హీరోలు మహేష్ బాబు, బన్నీలాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో వరుసగా ఛాన్స్ స్ కొట్టేస్తూ.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తోంది ఈ క్రేజీ బ్యూటీ. అయితే రష్మిక తన సక్సెస్ ఫుల్ జర్నీ గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

రష్మిక మండన్నా మాట్లాడుతూ.. ‘నేను సినిమాల పై రంగుల కలలు కని ఇక్కడకి రాలేదు. నా వృత్తిలో ఉండే కష్టసుఖాలు గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. సినీపరిశ్రమలో బయటకు కనబడని ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే ప్రతి వృత్తిలో కూడా ఇవి ఉంటాయి. వాట్ని మనం సమర్ధవంతంగా ఎదురుకొని ముందుకు వెళ్ళాలి. ముందుగా నేను సినిమాల్లోకి వెళ్తానంటే.. మా పేరేంట్స్‌ భయపడిపోయారు. తరువాత వారికి నా పై నమ్మకం వచ్చి.. ఇప్పుడు నాకు పూర్తి సపోర్ట్ ను అందిస్తున్నారు మా పేరెంట్స్’ అని చెప్పుకొచ్చింది ఈ క్రేజీ బ్యూటీ.

సంబంధిత సమాచారం :