మాస్ పోస్టర్ తో రష్మిక విశ్వరూపం.. ‘మైసా’ ఫస్ట్ గ్లింప్స్ కి డేట్ ఖరారు!

మాస్ పోస్టర్ తో రష్మిక విశ్వరూపం.. ‘మైసా’ ఫస్ట్ గ్లింప్స్ కి డేట్ ఖరారు!

Published on Dec 21, 2025 7:00 PM IST

mysaa

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రీసెంట్ గా నటించిన చిత్రాలు థామా అలాగే ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో అలరించిన సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ లో సోలోగా వస్తున్న సాలిడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రమే ‘మైసా’. కొన్నాళ్ల కితం అనౌన్సమెంట్ తోనే సాలిడ్ బజ్ ని ఈ చిత్రం క్రియేట్ చేసింది. ఇక మేకర్స్ లేటెస్ట్ గా రష్మికపై ఒక క్రేజీ అండ్ మాస్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ కి డేట్ ని ఇచ్చేసారు. మరి ఈ పోస్టర్ లో రష్మిక బీస్ట్ మోడ్ లో కనిపిస్తుంది.

ఒక చేతిలో తుపాకీ మరో చేతికి సంకెళ్లు కనిపిస్తున్నాయి. తన వేషధారణ, ముక్కుకి పుడక చూస్తుంటే మరో డీ గ్లామరస్ పాత్ర ఈసారి పవర్ఫుల్ గా రాబోతుంది అని అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమా గ్లింప్స్ ని ఈ డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్ ఫార్ములా వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు