లిప్ లాక్ ఫై స్పందించిన రష్మిక !

Published on Mar 21, 2019 2:00 am IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ఇటీవల ఈ చిత్రం యొక్క టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో వున్న లీడ్ పెయిర్ లిప్ లాక్ సీన్ ఫై విమర్శలు వచ్చాయి. దాంతో రష్మిక ఆ సన్నివేశం ఫై స్పందించింది.

పాత్ర డిమాండ్ మేరకే ఆ సన్నివేశం చేశానని నా వరకు నాకు ఇచ్చిన పాత్ర కు న్యాయం చేయడమే నా కర్తవ్యం అని రష్మిక తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో వెల్లడించింది.

భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మే 31న ఈ చిత్రం అన్ని సౌత్ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More