‘రష్మిక’ నిన్న ముంబైలో.. నేడు హైదరాబాద్ లో !

Published on Jul 26, 2021 8:34 am IST

క్రేజీ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఒక్కరోజు షూటింగ్ కోసం రష్మికా మందన్నా నిన్న ఆదివారం ముంబై వెళ్లి షూట్ లో పాల్గొంది. రష్మిక పై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. రష్మిక నిన్న ముంబైలో షూట్ పూర్తి చేసుకుని ఈ రోజు ఉదయమే హైదరాబాద్ లో జరుగుతున్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ షూటింగ్ లో జాయిన్‌ అయింది.

శర్వానంద్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌ లో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక “మిషన్ మజ్ను” సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి కాబట్టి, రష్మికను వాళ్ళు తీసుకున్నారు. కానీ, రష్మికకు ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

“సరిలేరు నీకెవ్వరు”, “గీత గోవిందం” సినిమాలు చూసి రష్మిక యాక్టింగ్ పై బాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారట. “మిషన్ మజ్ను” డైరెక్టర్ కు కూడా రష్మిక నటన బాగా నచ్చిందట. అలాగే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సరసన డెడ్లీ అనే స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ చిత్రంలో కూడా ఆమె కనిపించనుంది. తండ్రి-కుమార్తె కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్వీన్, సూపర్ 30 దర్శకుడు వికాస్ బహల్ దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :