MYSAA: రోజుకు 8 గంటల కఠిన శిక్షణ.. బ్యాంకాక్‌లో రష్మిక యాక్షన్ అవతార్ చూస్తే షాకవ్వాల్సిందే!

MYSAA: రోజుకు 8 గంటల కఠిన శిక్షణ.. బ్యాంకాక్‌లో రష్మిక యాక్షన్ అవతార్ చూస్తే షాకవ్వాల్సిందే!

Published on Apr 18, 2026 12:54 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆ చాప్టర్ తర్వాత మళ్ళీ తన ప్రొఫెషినల్ లైఫ్ లో బిజీగా మారింది. రష్మిక ఇది వరకు సినిమాలు అన్నీ ఒకెత్తు ఇప్పుడు చేస్తున్న ‘మైసా’ మరొక ఎత్తు. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధమైన డెడికేషన్ ని రష్మిక చూపిస్తుంది. ఇలా రోజుకు 8 గంటల కఠిన శిక్షణ తీసుకుంటున్న రష్మిక విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా కనిపించనుంది. పాత్ర డిమాండ్ మేరకు అటు ఎమోషనల్ గా, ఇటు ఫిజికల్ గా తనను తాను పూర్తిగా మార్చుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఒక కఠినమైన యాక్షన్ బూట్ క్యాంప్‌లో పాల్గొంటోంది. రోజుకు దాదాపు 8 గంటల పాటు హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్, హై-స్పీడ్ యాక్షన్, స్టంట్స్ నేర్చుకుంటోంది. గ్లోబల్ ఎక్స్‌పర్ట్స్ సమక్షంలో సాగుతున్న ఈ ట్రైనింగ్‌లో రష్మిక డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో అక్కడి నుంచి వస్తున్న ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ, చాలా సాఫ్ట్ గా కనిపించే రష్మిక.. ఇప్పుడు పూర్తిగా కండలు తిరిగిన ఫైటర్ లా మారిపోతోంది.

కేరళలో భారీ యాక్షన్ షెడ్యూల్

త్వరలోనే కేరళలో 16 రోజుల పాటు సాగే ఒక కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసమే ఇంటర్నేషనల్ స్టంట్ డైరెక్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో రష్మిక ఈ రేంజ్‌లో చెమటోడుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాల్లో ‘మైసా’ ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ లాంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా తనలోని అసలైన నటిని, ఫైటర్ ని బయటికి తీసేందుకు రష్మిక చేస్తున్న ఈ ప్రయోగం కచ్చితంగా ఆమె కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు