MYSAA: రష్మిక మందన్న సరికొత్త రికార్డ్.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్!

MYSAA: రష్మిక మందన్న సరికొత్త రికార్డ్.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్!

Published on Jul 9, 2026 3:05 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలతో సరికొత్త సాహసాలు చేస్తున్నారు. ఆమె నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మైసా’ (MYSAA) నుంచి తాజాగా ఒక సంచలన అప్‌డేట్ బయటికొచ్చింది. ఇండియన్ యాక్షన్ సినిమాలో ఇంతవరకు ఎవరూ ప్రయత్నించని సరికొత్త అధ్యాయానికి ఈ సినిమా వేదికైంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఒక హీరోయిన్‌పై చిత్రీకరించిన ‘అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్’ షూటింగ్‌ను చిత్ర బృందం విజయవంతంగా పూర్తి చేసింది.

ఈ యాక్షన్ సీన్ కోసం రష్మిక మందన్న ఎంతగానో శ్రమించారు. స్కూబా డ్రైవింగ్ కిట్ ధరించి నీటి అడుగున ఆమె చేసిన రిస్కీ స్టంట్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అందులో రష్మిక చాలా ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని ఒక అద్భుతమైన విజువల్ వండర్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ వినూత్న యాక్షన్ డ్రామాను డైరెక్టర్ రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు టీ-సిరీస్ (T-Series), అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్ అప్‌డేట్‌ను చాలా త్వరగా అనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది (2026) లోనే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక కెరీర్‌లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు