బాలీవుడ్ సినిమా పూర్తి చేసిన రష్మిక !

Published on Aug 30, 2021 12:00 pm IST

క్రేజీ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ‘మిషన్‌ మజ్ను’ చిత్రంతో హిందీ పరిశ్రమకు రష్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. అయితే, రష్మిక ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రష్మిక ఈ సినిమా గురించి మాట్లాడింది.

‘‘మిషన్‌ మజ్ను’ చిత్రం షూటింగ్‌ ను నేను పూర్తి చేశాను. ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయింది. శాంతను బాగ్చి ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఈ చిత్రంలో భాగం కావాలని బలంగా కోరుకున్నాను. పైగా హిందీలో నేను నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఏది ఏమైనా నా షూటింగ్‌ అప్పుడే పూర్తయిందనే విషయాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

అలాగే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సరసన డెడ్లీ అనే స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ చిత్రంలో కూడా రష్మిక కనిపించనుంది. తండ్రి-కుమార్తె కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్వీన్, సూపర్ 30 దర్శకుడు వికాస్ బహల్ దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :