అఖిల్ 4 కి జోడి కుదిరింది !

Published on Apr 26, 2019 9:36 am IST

వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూశాడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. ఇక మిస్టర్ మజ్ను తరువాత తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇక ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక అఖిల్ కు జోడిగా నటించనుందని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు హీరోయిన్ గా ఆమెనే ఫైనల్ చేశారని సమాచారం.

మరి కొద్దీ రోజుల్లో ఈ చిత్రాన్ని లాంఛ్ చేసి మే నుండి రెగ్యులర్ షూటింగ్ ను జరుపనున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ముందుగా దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు కానీ బడ్జెట్ ను తగ్గించండం కోసం మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ ను తీసుకున్నారట.

సంబంధిత సమాచారం :