పాపం రష్మిక తొందరపడింది…!

Published on Aug 18, 2019 3:02 am IST

సౌత్ లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళుతుంది నటి రష్మిక మందాన. ప్రస్తుతం ఈమె కార్తీ హీరోగా ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది. ఐతే ఆమె కొంచెం ఎక్సయిట్మెంట్ లో ఆ మూవీకి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటో షేర్ చేయడంతో పాటు ఆ చిత్ర టైటిల్ సుల్తాన్ అని రివీల్ చేయడంతో చిత్ర యూనిట్ కొంచెం షాక్ గురయ్యారని సమాచారం.

నిజానికి కార్తీ నెక్స్ట్ మూవీ టైటిల్ గా సుల్తాన్ పరిగణలో ఉందన్న విషయం ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ఐతే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ రష్మిక ఇన్స్టా గ్రామ్ పోస్ట్ వలన టైటిల్ బయటకు రావడంతో చిత్ర యూనిట్ కొంచెం అసహనానికి గురైనట్లు తెలుస్తుంది. కాగా రస్మిక ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో పాటు, బన్నీ,సుకుమార్ మూవీలతో పాటు నితిన్ నటిస్తున్న భీష్మ చిత్రాలలో హీరోయిన్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More