
‘మద్రాస్ కేఫ్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన రాశి ఖన్నా, తన తరువాతి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకోవడంతో తెలుగులో మంచి మంచి ఆఫర్లను కొట్టేసింది. ఇక ఈ మధ్యే రాశిఖన్నా హీరోయిన్గా నటించిన జిల్ విడుదల కాగా, రవితేజ బెంగాల్ టైగర్, రామ్ శివమ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది.
కాగా బెంగాల్ టైగర్, శివమ్ సినిమాల్లో రాశిఖన్నా ఇంతకుముందు సినిమాలకంటే చాలా అందంగా కనిపించనున్నట్లు సమాచారం. జిల్ విడుదలైన తర్వాత ఢిల్లీలోని ఓ ఆధ్యాత్మిక క్షేత్రంలో యోగా, ధ్యానం లాంటివి చేసి దాదాపు ఆరు కిలోలకు పైగా తగ్గడంతో పాటు ఇంతకుముందు కంటే మరింత ఎనర్జీతో కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఈ అందాల భామ చిక్కిన తర్వాత ఇంకెంత మంది హృదయాలను దోచుకుంటుందో చూడాలి.

