అప్పుడు కూడా గ్లామర్ ను ప్రదర్శించిన లేడీ

Published on Feb 8, 2022 1:15 pm IST


సౌత్ లో కేజీఎఫ్ చిత్రం తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ కి కొనసాగింపు గా కేజీఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్ పనులు మరింత వేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం లో రమీక సేన్ పాత్రను పోషించిన రవీనా టాండన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు మేకర్స్.

డెత్ ఆర్డర్ ను ఇచ్చెప్పుడు కూడా గ్లామర్ ప్రదర్శించారు అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. తన స్వర తంతువులతో వేరే కోణం లోకి తీసుకు వెళ్ళగలదు అని, తనతో పని చేయడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది అని తెలిపారు. ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కానున్న కేజీఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :