‘జార్జ్ క్రిష్’ కోసం రవీనా టాండన్ ?

‘జార్జ్ క్రిష్’ కోసం రవీనా టాండన్ ?

Published on Jul 12, 2026 7:00 AM IST

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఐతే, తాజాగా ఈ సినిమా కథ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఆమె పాత్ర పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ అయింది.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను ఆగస్టు సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్‌ గా ఫిక్స్ చేశారు. కానీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫస్ట్ షెడ్యూల్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు