పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది.
ఐతే, ఈ సినిమా అప్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
కాగా ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కూడా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో ఉండనుంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.


