ఓటీటీలోకి రవిబాబు లేటెస్ట్ చిత్రం ‘రేజర్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఓటీటీలోకి రవిబాబు లేటెస్ట్ చిత్రం ‘రేజర్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Published on Jun 19, 2026 10:12 AM IST

Razor

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు రవిబాబు రూపొందించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఈ ‘A’ రేటెడ్ చిత్రం, ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతోంది.

​2 గంటల 4 నిమిషాల రన్‌టైమ్‌ ఉన్న ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వీక్షించవచ్చు. రవిబాబు మార్క్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఓటీటీ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

​ఈ సినిమాలో తనీష్ అల్లాడి, ఇనయా సుల్తానా, బేబీ తేజల్ విఖ్యాతి, బెనర్జీ, రామరాజు కీలక పాత్రలు పోషించారు. రవిబాబు మరియు దగ్గుబాటి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ సంగీతం అందించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు