అదుగో తరువాత రవిబాబు ‘ఆవిరి’ !

Published on Jan 2, 2019 8:46 am IST

డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కించి మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు. అయితే ఇటీవల పందిపిల్ల ను హీరోగా పెట్టి ‘అదుగో’ అంటూ ఆయన చేసిన ప్రయోగం దారుణంగా విఫలం అయ్యింది. ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం గత ఏడాది భారీ ప్లాప్ సినిమాల జాబితాలో చేరిపోయింది.

ఇక ఇప్పుడు తాజాగా మరో డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించనున్నాడు ఈ దర్శకుడు. ‘ఆవిరి’ అనే వినూత్నమైన టైటిల్ తో రానున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మించనున్న ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు తర్వలోనే వెలుబడనున్నాయి. మరి రవి బాబు ఈచిత్రం తోనైనా బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More