పవన్ తో పని చేసేందుకు ఇదొక అద్భుత అవకాశం!

Published on Jul 29, 2021 9:03 pm IST

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు కలిసి ప్రొడక్షన్ నంబర్ 12 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం రవి కే చంద్రన్ ను టీమ్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఫోటో ను చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తో, ఈ చిత్రం కోసం పని చేయడం పై రవి కే చంద్రన్ స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు.

భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లతో పని చేయడం అద్భుత అవకాశం అని అన్నారు.పవన్ స్టైల్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ను డిఫెరెంట్ ఫ్రేమ్స్ లో చూపిస్తా అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్, రానా లు ఇద్దరు ఈ చిత్రం లో నటిస్తుండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా, త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :