రవితేజ సరసన ప్రియాంక, నభా ?

రవితేజ సరసన ప్రియాంక, నభా ?

Published on Apr 26, 2021 3:36 PM IST

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ కలయికలో రానున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఒకరు ప్రియాంక అరుల్ మోహన్ కాగా మరో హీరోయిన్ గా నభా నటేష్ నటించబోతుందని తెలుస్తోంది. అయితే ప్రియాంక అరుల్ మోహన్ మెయిన్ హీరోయిన్ అట. ఈ మధ్య వరుస సినిమాలలో ఫుల్ బిజీగా ఉంది ప్రియాంక. ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా ప్రియాంక అరుల్ మోహన్ కనిపించబోతుంది. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందట.

ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. పైగా త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. అదేవిధంగా రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవితేజ తన కామెడీతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు